JC Prabhakar Reddy: చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy: జేసీ గ్రామంలోకి రావడంతో బాణసంచా కాల్చిన అనుచరులు
JC Prabhakar Reddy: చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy: తాడిపత్రి నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆలూరు రంగనాథ స్వామి రథోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీకి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆలూరు బ్రహ్మోత్సవాలకు హాజరై, రథోత్సవంతో పాల్గొన్నారు. దీంతో ఉత్సవాల్లో పాల్గొనడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తుండడంతో లా అండ్ ఆర్డర్ దృష్ట్యా జేసీని ముందస్తుగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి తిరుగుప్రయాణమయ్యాక జేసీని గ్రామంలోని అనుమతించారు. జేసీ ఆలూరుకు చేరుకోగానే ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున బాణసంచా కాల్చి హాడావిడి చేశారు. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేసి అక్కడున్నవారిని ఉత్సహపరిచారు.