Malla Reddy: జవహర్‌నగర్ కార్పొరేషన్ రూపురేఖలు మారుస్తా
Malla Reddy: స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి
Malla Reddy: జవహర్‌నగర్ కార్పొరేషన్ రూపురేఖలు మారుస్తా
Malla Reddy: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ రూపురేఖలు మారుస్తానని, నెంబర్ వన్ మోడల్ టౌన్‌గా మారుస్తానని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. జవహర్ నగర్ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు కేటాయించానన్నారు. యువతకు స్టేడియం కోసం స్థలం కేటాయించామని, అందులో భాగంగా నిర్మాణ పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశానన్నారు. పార్కు, వైకుంఠధామాల పనులు ప్రారంభించామన్నారు. జవహర్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండి నడిపిస్తామన్నారాన.