కర్ఫ్యూ వేళ భద్రాద్రి పోలీసులు ఏం చేసారో చూడండి..

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి గాను ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశ్యాప్త ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు.

Update: 2020-03-22 15:27 GMT
Police Donate Food for Beggars

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి గాను ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశ్యాప్త ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఎవరూ నగరాల్లో తిరగక పోవడంతో ఎంతో మంది అనాధలు, దిక్కులేని ముసలివారు, చిన్నవారు, యాచకులు ఆకలితో బాధపడే పరిస్థితి ఎదురైంది. దీంతో కొంత మంది పోలీసులు వారి బాధను చూడలేక పోయారు. యాచకులకు ఆహార, పానీయాలు అందించారు.

అందరి హృదయాలను ఆకట్టుకునే ఈ సంఘటన భద్రాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజలందరూ వారి వారి ఇళ్లకే పరిమితమై పోయారు. దీంతో వృద్ద యాచకులకు, అనాధలు భద్రాచలం పోలీసులు భోజనం, పండ్లు అందజేశారు. దీంతో యాచకులంతా పోలీసులను దేవుడిలా వచ్చారంటూ దండం పెట్టారు. వారికి వందనాలు తెలిపారు. పోలీసులు కేవలం రక్షించే వారు మాత్రమే కాదని, పేదల ఆకలిని తీర్చే వారని ప్రతి ఒక్కరు సెల్యూట్ అంటున్నారు.

ఇక పోతే కరోనాను కట్టడి చేయడానికి మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు చూపించిన పట్టుదల ఈ నెల 31వ తేదీ వరకూ చూపించాలని ఆయన అన్నారు. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. ఇంటి అవసరాల కోసం కావాల్సిన పాలు, కూరగాయలు కోసం మాత్రమే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు నెలరోజులకు సరిపడా రేషన్‌ బియ్యం ఇస్తాం. తెల్లరేషన్‌ కార్డులు ఉన్నవారికి ఒక్కరికి ఉచితంగా 12 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని తెలిపారు కేసీఆర్.


Tags:    

Similar News