సీఎం కేసీఆర్ కి జనసేనాని విజ్ఞప్తి

నలభై రోజులకి పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి

Update: 2019-11-20 15:02 GMT
pawan kalyan

విధుల్లో చేరేందుకు సిద్దంగా ఉన్న ఆర్టీసీ కార్మికులను సానుభూతితో విధుల్లోకి చేర్చుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అయన ట్వీట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్.. " పెద్దలు, గౌ. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని, కార్మిక సంఘాల నేతలు ప్రకటించినందున వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను" అని పవన్ ట్వీట్ చేశాడు.

అంతేకాకుండా నలభై రోజులకి పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నానని, తద్వారా ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఆపై సానుకూలంగా వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. అంటూ మరో ట్వీట్ చేశాడు పవన్..

ఇక ఆర్టీసీ సమ్మెపై జేఏపీ వెనక్కితగ్గింది. విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ప్రకటించింది. అయితే బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణకు సిద్ధమన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్ధామరెడ్డి. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.



Tags:    

Similar News