నిందితులను ఉరి తీయకూడదు..పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-12-02 15:30 GMT

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం చేసిన నిందితులను నడిరోడ్డున ఉరి తీయాలని అంటున్నారు. కానీ, మనిషి చంపే హక్కు లేదని వ్యాఖ్యానించారు. తప్పులు చేసిన వారిని శిక్షించాలనే అలోచన ఉండోచ్చు, కానీ మనం కూడా ఉన్మాదులుగా మారుతున్నామని గ్రహించాలన్నారు. సింగపూర్ తరహాలో శిక్షలు ఉండాలని సూచించారు.గతంలో 2017లో ఓ చిన్నారి స్కూల్ నుంచి తిరిగి వచ్చి ఇంట్లో ఉరి వేసుకొని తల్లిదండ్రులను కనిపించింది. ఆ బాలికను పరీక్షించిన వైద్యులు పలుమార్లు అత్యాచారానికి గురైందని తెలిపారని గుర్తు చేశారు.

ఎంతో మంది నాయకులు ఉన్నారు. మహిళలపై అఘాయిత్యం జరిగితే మాట్లాడడానికి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సమాజంలో ధైర్యాన్ని తీసేశారని దిశపై అఘాయిత్యం జరిగిందంటే సమాజంలో మనుషులు మధ్య జీవిస్తున్నామా? అనే అనుమానం కలుగుతుందని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. "నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. నా బిడ్డలను బయటకు పంపిస్తే క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటా? దిశ ఘటనతో ఆ తల్లి ఏడుపు చూసి నాకు నిస్సహాయత వచ్చిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Full View

Tags:    

Similar News