TSPSC: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా

TSPSC: సీఎం రేవంత్‌ను కలిసిన కొద్దిసేపటికే చైర్మన్‌ పదవికి రాజీనామా

Update: 2023-12-12 02:33 GMT

TSPSC: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా

TSPSC: TSPSC చైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కొద్దిసేపటికే చైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేయడం.. ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. రాజీనామాకు ముందు సీఎంతో బోర్డుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గవర్నర్‌ తమిళిసైకి జనార్దన్‌ రెడ్డి రాజీనామా సమర్పించగా.. అందుకు ఆమె ఆమోదం తెలిపారు. తదుపరి చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారికి గవర్నర్‌ లేఖ రాశారు.

2021 మే నెలలో TSPSC ఛైర్మన్‌గా జనార్దన్‌ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వ హయాంలో TSPSC పేపర్‌ లీకేజీలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. ఇటీవల TSPSC గ్రూప్‌ - 1 పేపర్‌ లీకేజీ, పలు పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలపై TSPSC పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిరుద్యోగులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. వరుస పేపర్‌ లీకేజీల ఘటనలతో TSPSC బోర్డును రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. చైర్మన్‌ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా చేయాలనే డిమాండ్లు సైతం వినిపించాయి. ఈ పరిస్థితిలో TSPSC చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం.. తన పదవికి రాజీనామా చేశారు.

ఇదిలా ఉంటే.. TSPSC చైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేయడంతో అశోక్‌నగర్‌లో సంబరాలు చేసుకున్నారు నిరుద్యోగులు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. TSPSC ని పూర్తిగా ప్రక్షాళన చేసి.. ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు నిరుద్యోగులు.

Tags:    

Similar News