Jana Reddy: రేవంత్ నెలరోజుల పాలన పై జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Jana Reddy: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది
Jana Reddy: రేవంత్ నెలరోజుల పాలన పై జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Jana Reddy: రేవంత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి సర్కార్ నెలరోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు సాగుతోందని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని జానారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. అలాగే మిగిలిన ఐదు గ్యారెంటీలను వీలైనంత త్వరగా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జానారెడ్డి అన్నారు.