Jana Reddy: జానారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు
Jana Reddy: అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై ఫోర్‌మెన్ కమిటీ సమీక్ష
Jana Reddy: జానారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు
Jana Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ట్రబుల్ షూటర్‌గా కాంగ్రెస్ జానాను రంగంలోకి దింపింది. జానారెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్‌లతో కమిటీని నియమించింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం.. జానారెడ్డి ఆధ్వర్యంలో ఫోర్‌మెన్ కమిటీ నియామకం జరిగింది. టికెట్ల ప్రకటన తర్వాత అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఇవాళ ఈ కమిటీ సమావేశంకానుంది. అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై ఫోర్‌మెన్ కమిటీ సమీక్ష జరపనుంది.