Jagga Reddy: టీకాంగ్రెస్‌లో కొలిక్కిరాని జగ్గారెడ్డి అంశం

Jagga Reddy: ఇవాళ పార్టీ నేతలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశం

Update: 2022-02-25 02:30 GMT

Jagga Reddy: టీకాంగ్రెస్‌లో కొలిక్కిరాని జగ్గారెడ్డి అంశం

Jagga Reddy: టీకాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంశం కొలిక్కిరావడంలేదు. ఇవాళ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరులతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక గురువారం జ‌రిగిన సీఎల్పీ స‌మావేశంలో.. జ‌గ్గారెడ్డి తో పాటు భ‌ట్టి విక్ర‌మార్క‌, దుద్దీల శ్రీ‌ద‌ర్ బాబు, కోమ‌టి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో నేత‌లు.. జ‌గ్గారెడ్డిని బుజ్జగించార‌ని తెలుస్తోంది. అయితే తాను స‌మాచారం ఇవ్వ‌డానికే సీఎల్పీ స‌మావేశానికి వ‌చ్చాన‌ని రాజీనామా విషయంలో వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశార‌ని స‌మాచారం. ఇక ఇవాళ జరిగే సమావేశంపై భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News