Dharmapuri Arvind: కాంగ్రెస్‌లో చేరేవాళ్లు త్వరలో బీజేపీలోకి రావడం ఖాయం
Dharmapuri Arvind: అవినీతి పరులను వదిలిపెట్టమని మోడీ చెప్పారు
Dharmapuri Arvind: కాంగ్రెస్‌లో చేరేవాళ్లు త్వరలో బీజేపీలోకి రావడం ఖాయం
Dharmapuri Arvind: కాంగ్రెస్ పార్టీలో చేరికలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. తొందరపడి కాంగ్రెస్‌లోకి వెళ‌్లవద్దని సూచించారు. కాంగ్రెస్‌లో చేరిన వాళ్లు త్వరలోనే బీజేపీలోకి రావడం ఖాయమన్నారు. ఖమ్మంలో బీజేపీ విజయానికి తమ వద్ద స్ట్రాటజీ ఉందన్నారు. చట్టానికి ఎవరు అతీతులు కారని.. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలిసిందేనని చెప్పారు. బిడ్డను కాపాడటానికే కేసీఆర్ తాపత్రయపడుతున్నారని.. కుటుంబ పార్టీలకు ఓటేస్తే.. వాళ్ళ ఆస్తులే పెరుగుతాయని ఎద్దేవా చేశారు. అవినీతిపరులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని ప్రధాని మోడీ చెప్పారని అరవింద్ వివరించారు