Raja Singh: వచ్చే అసెంబ్లీలో నేను ఉండకపోవచ్చు.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Raja Singh: ఇంటా బయటా నేను అసెంబ్లీకి రావొద్దని కోరుకుంటున్నారు
Raja Singh: వచ్చే అసెంబ్లీలో నేను ఉండకపోవచ్చు.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rajasingh: అసెంబ్లీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఉండకపోవచ్చన్నారు. ఇంటా బయటా తాను అసెంబ్లీకి రావొద్దని కోరుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ధూల్‌పేట్‌లో పర్యటిస్తానని, అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పి మాట తప్పారన్నారు. అసెంబ్లీలో తానున్నా లేకున్నా ధూల్‌పేట్‌ను అభివృద్ధి చేయాలని స్పీకర్‌ని రాజాసింగ్ కోరారు. అయితే.. రాజాసింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.