Inter online schedule: తెలంగాణా ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల షెడ్యూల్ విడుదల!

Inter Online Schedule: తెలంగాణా ఇంటర్ ఆన్ లైన్ క్లాసెస్

Update: 2020-08-30 08:10 GMT

Telangana Inter online classes

కరోనా దెబ్బతో అన్నిరంగాలలో పురోగతి ఆగిపోయింది. ఇది ఒక ఎత్తైతే.. విద్యార్ధుల చదువులు పూర్తిగా ఆగిపోయాయి. మెల్ల మెల్లగా పరిస్థితులు మారుతున్నాయి. కరోనా కారణంగా 2020-21 విద్యాసంవత్సరం ప్రారంబం కాలేదు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా విద్యార్ధులకు నష్టం చేయకూడదని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి టైమ్ టేబుల్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం..

- ఉదయం సమయంలో ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు ఆన్‌లైన్‌ క్లాసులు ఉంటాయి.

- మధ్యాహ్నం సమయంలో 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండనున్నాయి.

- మార్నింగ్ సెషన్లో వారంలో ఆరు రోజులు (సోమ-శని) వరకు దూరదర్శన్ యాదగిరి ఛానెల్‌ ద్వారా విద్యార్ధులకు తరగతులు బోధించనున్నారు.

కాగా.. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణలో భాగంగా ఉపాధ్యాయులు ఈ నెల 27 నుంచి కాలేజీలకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 4 గైడ్ లైన్స్ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసి ఉంటాయి. ఆన్ లైన్, దూరవిద్య తరగతులు నిర్వహించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.



Tags:    

Similar News