తెలంగాణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు... జాతీయజెండాను ఆవిష్కరించిన మంత్రులు

Independence Day celebrations : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్నప్పటికీ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పలువురు రాష్ట్ర మంత్రులు నిర్వహించారు.

Update: 2020-08-15 07:25 GMT
ప్రతీకాత్మక చిత్రం

Independence Day celebrations : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్నప్పటికీ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పలువురు రాష్ట్ర మంత్రులు నిర్వహించారు. జెండాలను ఆవిష్కరించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే సిరిసిల్ల జిల్లాలొ శనివారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఈ రోజున రైతు రాజ్యంగా బాసిల్లుతోందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ స్వతహాగా రైతు కావడం వల్లే వారి కష్టాలను తెలుసుకున్న సీఎం రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డేతో పాటు అన్ని శాఖల అధికారులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఇక ఇటు ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా వేడకలు నిరాడంబరంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావంతో ప‌ల్లెలు ప్రగతి పథంలో ప‌య‌నిస్తున్నాయ‌న్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామంలో 24 గంట‌ల‌పాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా, ఇంటింటికీ మిష‌న్ భ‌గీర‌థ ద్వారా ఆరోగ్యకరమైన, శుద్ధి చేసిన మంచినీరు అందుతుంద‌న్నారు. రైతాంగానికి పంట‌ల పెట్టుబ‌డులు, 24 గంట‌ల‌పాటు ఉచిత విద్యుత్ తోపాటు రుణ మాఫీలు కూడా ఇస్తున్నామ‌ని వివ‌రించారు. తెలంగాణ ప్రగతిని చూసిన చాలా రాష్ట్రాలు సీఎం కేసీఆర్ పథకాలను కాపీ కొడుతున్నారన్నారు. ప‌ల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.339 కోట్లు విడుద‌ల చేయడం దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు.

అదేవిధంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జెండా ఆవిష్కరించి వందనం చేశారు. ఇక నిర్మల్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు.




Tags:    

Similar News