Telangana: తెలంగాణలో పెరిగిపోతున్న పెండింగ్‌ బిల్లులు

Telangana: ఇరిగేషన్ శాఖలో రూ.11 వేల 600 కోట్లు

Update: 2021-09-10 03:47 GMT

తెలంగాణలో పరిగిన పెండింగ్ బిల్లులు (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణలో పెండింగ్‌ బిల్లులు పెరిగిపోతున్నాయి. వివిధ శాఖల్లో చేపట్టిన పనులకు ప్రభుత్వం నిధులను నిలిపివేసిందని కాంట్రాక్టర్స్‌తో పాటు ప్రభుత్వ అధికారులు చర్చించుకుంటున్నారు. ఇరిగేషన్ శాఖలో 11 వేల ఆరు వందల కోట్లు, మిషన్ భగీరథలో 1300 కోట్లు, పంచాయతీరాజ్ 650 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ హెల్త్ 300 కోట్లు, మహిళా సంఘాలకు మూడు వేల ఒక వంద కోట్లు, జీహెచ్‌ఎంసీకి ఒక వెయ్యి 100 కోట్లు, ఎడ్యుకేషన్ కి 250 కోట్లు, ఆర్ అండ్ బీకి 1800 కోట్లు, పబ్లిక్ హెల్త్ 900 కోట్లు, గురుకులాల్లో 350 కోట్లు, రుణమాఫీ కి 1500 కోట్లు, కళ్యాణ లక్ష్మి పథకానికి వందల కోట్లు, పశుసంవర్ధక శాఖలో 150 కోట్ల బిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి.

ప్రభుత్వ పథకాలు అమలు చేయడంతో పాటు పనులకు నిధులు విడుదల చేసి బకాయిలు చెల్లించాలని భావించిన వేరే పథకాల అమలుకి ఉపయోగించుకోవడం వాళ్ళ బిల్స్ పెండింగ్‌లో ఉంటున్నాయని అధికారులు తెలిపారు. దళిత బంధు పథకానికి ఒక్క హుజురాబాద్ కె 2 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో వివిధ శాఖల్లో చేపట్టిన పనులకు ప్రభుత్వం నిధులను నిలిపివేసిందని చర్చించుకుంటున్నారు.

కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్‌లను అనుకున్న సమయానికి పూర్తి చేసినా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి లాంటి ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లకు దాదాపు 8 వేల కోట్ల మేర బకాయిలు ఉండడంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News