ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు

మార్కెట్లో రోజు రోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి.

Update: 2019-11-11 09:16 GMT

మార్కెట్లో రోజు రోజుకూ కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. వంద రూపాయలు మర్కెట్ కు తీసుకెళితే సంచి నిండా కూరగాయలు వచ్చేవి కానీ ఇప్పుడు వంద రూపాయలు తీసుకెళితే కేవలం ఏదో రకం కూరగాయ మాత్రమే వస్తుంది. దీంతో వినియోగదారులు కూరగాయలు తెచ్చుకోవడానికి మార్కెట్ కు వెళ్లాలంటే చాలు భయపడుతున్నారు. ప్రతి నిత్యం కూరగాయల ధరలు పెరుగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కూరగాయల ధరలు పెరగడంతో ఇంక ఏం కొని ఏం తింటాం అని ప్రజలు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా వర్షపాతం ఎక్కువగా ఉండడంతో ఈ కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వర్షపాతం కారణంగా పంటల దిగుబడి తక్కువగా ఉండడంతో ఈ ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లషకులు తెలుపుతున్నారు. అంతే కాకుండా ఈ సీజన్ లో అయ్యప్ప స్వాములు, భవానీలు ఉండడంతో అన్నదానాలకు కూరగాయలను ఎలాగయినా తీసుకుంటారనే ఉద్దేశంతో వీటి ధరలను తగ్గించడం లేదు. రైతు బజార్ లో చూసినా అదే పరిస్థితి ఏ రకం కూరగాయని కొందామన్నా వాటి ధరలు రూ.40లకి పైగానే పలుకుతున్నాయి.

అయితే ప్రస్తుత మార్కెట్లో కూరగాయల ధరలు చూసుకుంటే టమోటో (కిలో) రూ. 30-50, కాకరకాయలు రూ. 55, క్యాప్సికం రూ. 50, పచ్చిమిర్చి (కిలో) రూ. 50-70, బీరకాయలు రూ. 46, బీట్‌ రూట్ రూ. 45, ఫ్రెంచ్ బీన్స్ రూ. 50, వంకాయలు రూ. 40, ఉల్లిపాయలు (కిలో) రూ. 70-100, దొండకాయలు రూ. 43, పెద్దచిక్కుడు రూ. 76, క్యారెట్ రూ. 60 గా ఉన్నాయి. ఈ కూరగాయల ధరల వలన పేద కుటుంబాలకు చెందిన వారు పప్పు, మజ్జిగతో నే వారి ఆకలిని తీర్చుకునే పరిస్థితి నెలకొంటుంది.

Tags:    

Similar News