పెరిగిన బస్సు చార్జీలను తగ్గించాలి

పెరిగిన బస్సు చార్జీలను తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ కు వినతిపత్రం సర్పించారు.

Update: 2019-12-02 12:23 GMT

కరీంనగర్ టౌన్ : పెరిగిన బస్సు చార్జీలను తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ కు వినతిపత్రం సర్పించారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం కూడబలుక్కొని ప్రజలపై భారం వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బస్సు చార్జీలు అధికమొత్తంలో పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతుందని దీనిపై ప్రభుత్వం సమీక్షించాలని అన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కోసం వేల కోట్లు ఇస్తున్న మన ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలపై భారం వేయడం కాదని అన్నారు.

పెంచడం అంటే అధిక మొత్తంలో కాదు సామాన్యుడిపై భారం పడకుండా తక్కువ మొత్తంలో నష్టం ఉండదు కానీ ఒకేసారి 20 పైసలు పెంచడంతో కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఆలోచించినా అంత డబ్బు ప్రజలపై భారం పడుతుందని ఆలోచించాలని అన్నారు. పెరిగిన చార్జీలు తగ్గించకుంటే ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. 

Tags:    

Similar News