గురుకుల పాఠశాలలో 35 మంది విద్యార్థులకు అస్వస్థత
బిచ్కుంద మైనారిటీ గురుకుల పాఠశాలలోని రాత్రి భోజనం తిన్న 35 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కామారెడ్డి: బిచ్కుంద మైనారిటీ గురుకుల పాఠశాలలోని రాత్రి భోజనం తిన్న 35 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులకు కడుపు నొప్పి సమస్యలు వచ్చాయి. విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆహారం, నీళ్లు కలుషితం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు ఎంపీపీ వెంకన్న , భగవాన్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అస్వస్థతకు గురైన చిన్నారుల ఆరోగ్యాల విషయం ఆసుపత్రి సూపరిడెంట్ తో చర్చించి వారికి తగిన వైద్యం అందించాలని వారికి పూర్తిగా తగ్గిన తర్వాతే వారిని డిచర్జ్ చెయ్యాలని సూచించారు.