KTR: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుంది
KTR: గత పాలకులెవరూ రైతులను పట్టించుకోలేదు
KTR: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుంది
KTR: కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 9ఏళ్లలో జరిగిన పనులు, గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. వారంటీ లేని కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీలను నమ్మొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందన్నారు. 60ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. గత పాలకులెవరు రైతులను పట్టించుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని తెలిపారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 378 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.