KTR: రూ.4వేలు పెన్షన్ ఇస్తామంటే.. ఎవ్వరూ నమ్మరు

KTR: మళ్లీ దళారుల రాజ్యం తెస్తామంటే తెలంగాణ సమాజం సహించదు

Update: 2023-07-03 02:05 GMT

KTR: రూ.4వేలు పెన్షన్ ఇస్తామంటే.. ఎవ్వరూ నమ్మరు

KTR: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ ఖమ్మం సభలో ప్రకటించడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణి పోర్టల్‌ను ఎత్తేసి... మళ్లీ దళారుల రాజ్యాన్ని తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని పేర్కొన్నారు.

కర్ణాటకలో అన్నభాగ్య కార్యక్రమాన్ని అమలుచేస్తామని, ఆ విషయాన్నే పట్టించుకోలేదని గుర్తుచేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీని మరచి... తెలంగాణలో నాలుగువేలరూపాయల పెన్షన్ ఇస్తామంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేషన్ ఇవ్వనోళ్లు... తెలంగాణకొచ్చి డిక్లరేషన్ పేరుతో కల్లబొల్లికబుర్లు చెబితే విశ్వసించేదెవరని ప్రశ్నించారు.

కర్ణాటకలో బిజెపిని ఓడించింది... ప్రజలే గానీ... కాంగ్రెస్ విజయం కాదన్నారు. మరో ప్రత్యామ్నయం లేకుండా.. కాంగ్రెస్ పార్టీని గెలిపించారని పేర్కొన్నారు.

తెలంగాణలో సమ్మక్క, సారలమ్మ జాతరలా సాగుతున్న పోడుభూముల పట్టాల పంపిణీ విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోకుండా.. ఖమ్మం సభలో మాట్లాడారని ట్విట్టర్లో ప్రస్తావించారు. రాహుల్ గాంధీకి పోడుపట్టాల పంపిణీ కనబడకుంటే... కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకోమని వంగ్యాస్త్రాన్ని సంధించారు.


Tags:    

Similar News