Government Teachers : ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు

Update: 2020-09-26 08:09 GMT

Government Teachers : తెలంగాణ రాష్ట్రంలో కార్పోరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే కాదు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉద్యోగులకు కూడా గుర్తింపు కార్డులను ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్యలను అధికారులు వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డులను ఇచ్చేందుకు రాష్ట్ర సమగ్ర శిక్ష కసరత్తు చేస్తోంది. ఉపాధ్యాయులు సమగ్ర వివరాలను ఈప్రక్రియలో భాగంగా నివేదిస్తున్నారు.

ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాలోని 732 పాఠశాలల్లో 2763 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల్లో 2646 మంది వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసారు. ఇంకా అప్ లోడ్ చేయాల్సిన వారు 117 మంది ఉన్నారు. ఇక మిగిలిన ఉపాధ్యాయులు నమోదు చేసుకోవడానికి 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులు సమాచారం సేకరించగా డేటాఎంట్రీ ఆపరేటర్లు ఎంఐఎస్‌ కోఆర్డినేటర్ల ద్వారా యూడైస్‌ (యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) నమూనాల్లో పొందుపరిచారు. ఇప్పటికే ఉపాధ్యాయులు వెబ్‌సైట్‌లో నమోదు పూర్తి చేయాల్సి ఉన్నా అలసత్వం చూపుతున్నారని తెలుస్తోంది.

ఉపాధ్యాయుల బ్లడ్‌గ్రూపు, నివాస సమాచారం జతచేయడంతో పాటు వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉపాధ్యాయుల వివరాల నమోదులో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జిల్లా చివరి స్థానంలో నిలిచినట్లు సమాచారం. ఏమైనా తేడాలు ఉంటే వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఉపాధ్యాయులు ప్రధానంగా పనిచేస్తున్న జిల్లా, మండలం, పాఠశాల డైస్‌కోడ్, హోదా, మొబైల్‌ నంబర్, ఎ క్కడ విధులు నిర్వర్తిస్తున్నారు, నివాసం, ఉపాధ్యాయుడి కోడ్, పుట్టినతేదీ, రక్తం గ్రూపు, ఫొటో, తదితర వివరాలు గుర్తింపుకార్డులో పొందుపరుస్తారు.

Tags:    

Similar News