IBOMMA Ravi: IBOMMA రవికి బిగుస్తోన్న ఉచ్చు
IBOMMA Ravi: IBOMMA రవికి ఉచ్చు బిగుస్తోంది. ఇమ్మడి రవిపై మరో మూడు సెక్షన్లు నమోదు చేశారు పోలీసులు.
IBOMMA Ravi: IBOMMA రవికి బిగుస్తోన్న ఉచ్చు
IBOMMA Ravi: IBOMMA రవికి ఉచ్చు బిగుస్తోంది. ఇమ్మడి రవిపై మరో మూడు సెక్షన్లు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే రవిపై 10 సెక్షన్లు పెట్టారు. ఐటీ యాక్ట్, BNS సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్ కింద 10 సెక్షన్లు నమోదు చేశారు. తాజాగా ఫోర్జరీ సెక్షన్లను కూడా పోలీసులు జోడించారు.
ప్రహ్లాద్ పేరుతో పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తీసుకున్నట్టు గుర్తించారు. ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ చేశారు పోలీసులు. ఇక.. రెండోరోజు కస్టడీలో ఐబొమ్మ రవిని పోలీసులు ప్రశ్నించనున్నారు. క్రిప్టో వాలెట్స్ వివరాలు, విదేశీ పాట్నర్ల వివరాలపై ఆరా తీయనున్నారు.