iBomma Ravi: పోలీసు కస్టడీలో ఐబొమ్మ రవి.. ప్రశ్నిస్తున్న పోలీసులు

iBomma Ravi: ప్రముఖ సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) ప్రధాన నిర్వాహకుడు, నిందితుడు ఇమంది రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

Update: 2025-11-20 08:58 GMT

iBomma Ravi: పోలీసు కస్టడీలో ఐబొమ్మ రవి.. ప్రశ్నిస్తున్న పోలీసులు

iBomma Ravi: ప్రముఖ సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) ప్రధాన నిర్వాహకుడు, నిందితుడు ఇమంది రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. రవిని ప్రశ్నించేందుకు ఐదు రోజుల కస్టడీకి బుధవారం నాడు నాంపల్లి కోర్టు అనుమతించిన నేపథ్యంలో, అతడిని చంచల్‌గూడ జైలు నుంచి బషీర్‌బాగ్‌లోని సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోలీసులు ప్రస్తుతం పైరసీ నెట్‌వర్క్‌కు సంబంధించిన వివిధ కోణాల్లో రవిని ప్రశ్నిస్తున్నారు. గత ఆరేళ్లుగా కెరేబియన్ దీవులను కేంద్రంగా చేసుకుని 66 మిర్రర్ వెబ్‌సైట్ల ద్వారా రవి భారతీయ భాషల్లోని 21 వేల సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

కీలక ఆరోపణలు: ఇంతేకాకుండా, రవి 50 లక్షల మంది వినియోగదారుల డేటాను సేకరించి, దాన్ని సైబర్ నేరస్థులు, గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులకు విక్రయించి కోట్లు ఆర్జించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఐదు రోజుల కస్టడీలో రవి అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో సహా ఈ అక్రమ లావాదేవీలపై మరింత కీలక సమాచారం రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News