Hyderabad: హైదరాబాద్‌లో రూ.19 లక్షలకే 2 BHK ఫ్లాట్‌లు.. ఇవాళే చివరి తేదీ
Hyderabad: నగరంలోని మధ్యతరగతి వర్గానికి తీపికబురుగా మారే అవకాశం ప్రభుత్వ హౌసింగ్ బోర్డు కల్పిస్తోంది. బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో అత్యంత తక్కువ ధరలకు స్వగృహ ఫ్లాట్‌లను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Hyderabad: హైదరాబాద్‌లో రూ.19 లక్షలకే 2 BHK ఫ్లాట్‌లు.. ఇవాళే చివరి తేదీ
Hyderabad: నగరంలోని మధ్యతరగతి వర్గానికి తీపికబురుగా మారే అవకాశం ప్రభుత్వ హౌసింగ్ బోర్డు కల్పిస్తోంది. బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో అత్యంత తక్కువ ధరలకు స్వగృహ ఫ్లాట్‌లను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా, రూ.19 లక్షలకే 2 BHK ఫ్లాట్‌లు, రూ.13 లక్షలకే 1 BHK ఫ్లాట్‌లు విక్రయించనున్నారు.
బుధవారం (జులై 30) బండ్లగూడలోని రాజీవ్ స్వగృహలో లాటరీ ప్రక్రియ నిర్వహించగా, అక్కడి 159 ఫ్లాట్‌లకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. హౌసింగ్ బోర్డుకు ఈ వేలం ద్వారా రూ.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లాటరీలో 11 త్రీ BHK ఫ్లాట్‌లకు 1325 దరఖాస్తులు, 2 BHKలకు 525 దరఖాస్తులు, 1 BHKలకు 234 దరఖాస్తులు వచ్చాయి.
సీనియర్ సిటిజన్ల కోసం కేటాయించిన ఫ్లాట్‌లకు ప్రాధాన్యతనిస్తూ లాటరీ ప్రారంభించారు. అయితే, బండ్లగూడలో ఫ్లాట్ దక్కని అభ్యర్థులకు పోచారంలో మరో అవకాశాన్ని కల్పించింది హౌసింగ్ బోర్డు. అదే దరఖాస్తుతో పోచారంలో ఫ్లాట్‌లకు అర్హత పొందవచ్చని అధికారులు తెలిపారు.
పోచారంలో 340 రెండు బెడ్‌రూమ్ ఫ్లాట్‌లు రూ.19 లక్షలకు, 255 ఒక బెడ్‌రూమ్ ఫ్లాట్‌లు రూ.13 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ఈ దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు సాయంత్రం వరకు మాత్రమే కొనసాగనుండగా, లాటరీ ప్రక్రియ ఆగస్టు 1, 2 తేదీల్లో జరగనుంది.
అధికారులు మాట్లాడుతూ, “ఇది మధ్యతరగతి ప్రజలకు ఓ అరుదైన అవకాశం. తక్కువ ధరలో సొంతింటి కలను నెరవేర్చుకునే అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు” అని సూచిస్తున్నారు.
ఇక, హైదరాబాద్‌లో భూముల ధరలు రెక్కలేస్తున్నాయి. తాజాగా కూకట్‌పల్లిలో హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఓపెన్ వేలంలో ఎకరం భూమి రూ.65.34 కోట్లకు అమ్ముడుపోయింది. కూకట్‌పల్లి ఫేజ్-4లోని ఆ ప్లాట్‌ను ICAI సంస్థ సొంతం చేసుకుంది. ఈ రికార్డు ధర నగరంలో భూవిలువలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో మరోసారి వెల్లడించింది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల చివరి తేదీ: జూలై 31 (ఈ రోజు సాయంత్రం వరకు)
లాటరీ తేదీలు: ఆగస్టు 1, 2