Hyd Metro: నేటి నుంచి హైదరాబాద్ లో మెట్రోలో పెంచిన ఛార్జీల రాయితీ అమలు

Update: 2025-05-24 01:36 GMT

 Hyd Metro: నేటి నుంచి హైదరాబాద్ లో మెట్రోలో పెంచిన ఛార్జీల రాయితీ అమలు

Hyd Metro: మెట్రో రైలులో పెంచిన ప్రయాణ ఛార్జీల్లో 10శాతం రాయితీ శనివారం నుంచి వర్తిస్తుందని ఎల్అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ వెల్లడించింది. రాయితీ అనంతరం దూరాన్ని బట్టి ప్రయాణ ఛార్జీ ఎంత చెల్లించాలనే పట్టికను శుక్రవారం రిలీజ్ చేసింది. మెట్రో రైలు ఛార్జీలు కనీసం రూ. 10 నుంచి 12కి గరిష్టంగా 60 నుంచి 75కి పెంచిన సంగతి తెలిసిందే. వీటిపై 10శాతం రాయితీతో కనీస ఛార్జీ రూ. 11 గరిష్ట ఛార్జీ రూ. 69 అవుతుందని తెలిపింది. ఫేర్ ఫిక్సెషన్ కమిటీ సిఫార్సు చేసిన ఛార్జీల్లో తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. క్యూఆర్ కోడ్ కాగితపు టికెట్, టోకెన్, డిజిటల్ టిక్కెట్లు , స్మార్ట్ కార్డులు అన్నింటిలోనూ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.

రాయితీల అనంతరం ఛార్జీలంటూ మెట్రో ప్రకటించిన ధరలు చూస్తే ఇదేం రాయితీ అన్నట్లుగా ఉంది. కొన్ని ఫేర్ జోన్లో 10 శాతం కంటే తక్కువే రాయితీ ఉంది. 24కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే గరిష్ట ఛార్జీరూ. 75 ఉండగా 10 శాతదం రాయితీ ప్రకారం 67.5అవుతుంది. కానీ రూ. 69గా పట్టిలో చూపారు. 2, 4కిలోమీటర్ల వరకు ఉన్న ఫేర్ జోన్లు మినహా మిగతా అన్నింట్లోనూ పది శాతం కంటే తక్కువే రాయితీని ఇచ్చారు. 18 కిలోమీటర్లు ఆపైన ప్రయాణానికి పెంచిన ఛార్జీ రూ. 60 అయితే 10 శాతం తగ్గింపుతో రూ. 54 కావాలి. కానీ రూ. 56కి దీన్ని సవరించారు. ఇదేం తగ్గింపు అంటూ ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు. 

Tags:    

Similar News