హైదరాబాద్: మలక్‌పేటలో భారీ దొంగతనం – రూ. 50 లక్షల నగదు, 30 తులాల బంగారం మాయం
హైదరాబాద్ మలక్‌పేట ఆఫీసర్స్ కాలనీలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న రూ.50 లక్షల నగదు, 30 తులాల బంగారం, 40 తులాల వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు. నేపాలీ ముఠా రంగంలో ఉన్నట్టు అనుమానాలు.
హైదరాబాద్: మలక్‌పేటలో భారీ దొంగతనం – రూ. 50 లక్షల నగదు, 30 తులాల బంగారం మాయం
హైదరాబాద్‌లోని మలక్‌పేట ఆఫీసర్స్ కాలనీలో దొంగలు పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రూ.50 లక్షల నగదు, 30 తులాల బంగారం, 40 తులాల వెండిని దొంగలు అపహరించినట్టు తెలుస్తోంది.
ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నేపాలీ ముఠానే ఈ దొంగతనానికి కారణమని అనుమానిస్తున్నట్లు చెప్పారు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.