Election Campaign: నేటితో ముగియనున్న ఉపఎన్నిక ప్రచార ఘట్టం

*హుజూరాబాద్‌, బద్వేలులో హోరాహోరీగా ప్రచారం *ఈ నెల 30న హుజూరాబాద్‌, బద్వేలులో పోలింగ్‌

Update: 2021-10-27 01:30 GMT

నేటితో ముగియనున్న ఉపఎన్నిక ప్రచార ఘట్టం(ఫైల్ ఫోటో)

Election Campaign: హుజూరాబాద్‌, బద్వేలు ఉపఎన్నికల ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. అన్ని పార్టీల ప్రచారాలతో మార్మోగిన వీధులు సాయంత్రం అవ్వగానే సైలెంట్‌ కానున్నాయి. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఈ నెల 30న జరిగే పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంది.

హుజూరాబాద్‌ ఉపఎన్నికను టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. నువ్వా-నేనా అనే తరహాలో పోటీ పడుతున్నాయి. ఓటర్ల మన్ననల్ని పొందేందుకు చెమటోడ్చుతున్నారు. మాటల తూటాలు పేలాయి. పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇప్పటివరకు ప్రచారంలో ప్రత్యక్షంగా ఓటర్లను మెప్పించిన పార్టీలు ఇకపై తెరవెనుక మంత్రాంగానికి సిద్ధమయ్యాయి. ఇన్నాళ్లుగా అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలకు భిన్నంగా తాయిలాలు, ప్రలోభాలపర్వం కనిపించనుంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా నియోజకవర్గంపై దృష్టి సారిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకునేలా ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.

Full View
Tags:    

Similar News