శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
Sriram Sagar: ఇన్‌ఫ్లో 30,555.. ఔట్ ఫ్లో 9,080
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
Sriram Sagar: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో దృష్ట్యా ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 30 వేల 555 ఉండగా, ఔట్ ఫ్లో 9 వేల 80గా ఉంది.