NTR Silver Coin: ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న రూ.100 నాణేల కోసం హైదరాబాద్ మింట్ వద్ద క్యూ కట్టిన ఎన్టీఆర్ అభిమానులు
NTR Silver Coin: ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణేనానికి ఫుల్ డిమాండ్
NTR Silver Coin: ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న రూ.100 నాణేల కోసం హైదరాబాద్ మింట్ వద్ద క్యూ కట్టిన ఎన్టీఆర్ అభిమానులు
NTR Silver Coin: నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం అమ్మకాలు హైదరాబాద్ నగరంలో ప్రారంభమయ్యాయి. ఈ నాణేన్ని దక్కించుకోవడం కోసం ఎన్టీఆర్ అభిమానులు పోటీ పడుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి అభిమానులు హైదరాబాద్, సైఫాబాద్ మింట్ మ్యూజియంలో నాణేల కోసం క్యూ కట్టారు. గంటల తరబడి లైన్‌లో నిలబడి నాణెం కొనుగోలు చేస్తున్నారు. ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణేన్ని మూడు ధరల్లో నిర్ణయించి అమ్ముతున్నారు. 4,850 రూపాయలు, 4,380 రూపాయలు, 4,050 రూపాయలుగాగా ధరలు నిర్ణయించి అధికారులు గిఫ్ట్ బాక్స్‌తో ఆనాణాన్ని అమ్ముతున్నారు. ఎన్టీఆర్ నాణేనాన్ని రిలీజ్ చేయడం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు