Basara IIIT: బాసర ట్రిపుల్ఐటీ ఎదుట హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన
Basara IIIT: కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదంటూ నిరసన
Basara IIIT: బాసర ట్రిపుల్ఐటీ ఎదుట హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన
Basara IIIT: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ నాలుగేళ్లుగా వీడీఏ, పీఎఫ్ డబ్బులు చెల్లించటంలేదంటూ నిరసనకు దిగారు, మూడు నెలల నుంచి వేతనాలు సైతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ సిబ్బంది ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని కార్మికులను సముదాయించారు. కాంట్రాక్టర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.