గణాధీషుడూ.. గుర్రపు స్వారీ !

Update: 2020-08-15 12:17 GMT

Horse Rider in Sangareddy: మార్కెట్లోకి ఎటువంటి మోడల్ వెహికల్ దిగుమతి అయినా, అందుబాటులో ఎన్ని వాహనాలు ఉన్నా అతను మాత్రం వాటి జోలికి పోడు. తాతల నాటి నుంచి నమ్ముకున్న "నా అశ్వమే నాకు అన్నీ" అంటున్న ఆ జాకీ ఎవరో ఓ లుక్కేద్దాం. ఇతని పేరు గణాధిషా. ఊరు సంగారెడ్డి జిల్లాలోని ఆత్మకూరు. ఇతను ఏ పని మీద బయటికి వెళ్లాలన్నా తన గుర్రం మీదే వెళ్తాడు. పొలానికైనా పెళ్లికైనా చివరికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకైనా ఈ గుర్రం మీదే వెళ్తాడు.

ప్రమాదవశాత్తు చెరుకు మిషన్ లో ఇరుక్కుని ఓ చెయ్యిని కోల్పోయిన 65 ఏళ్ల గణాధిషా గుర్రం స్వారీలో మెలుకువలు నేర్చుకున్నాడు. ఒక్క చేతితోనే అవలీలగా గుర్రాన్ని తోలుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. తన తాతలు కూడా గుర్రలపైనే వెళ్లేవారని, ఆ అలవాటును తను కూడా కొనసాగిస్తున్నప్పటికీ తన కుమారులు మాత్రం బైకులు వాడుతున్నారు. ప్రతీరోజు ఉదయం తన గుర్రాన్ని శుభ్రంగా నీటితో కడిగి అందంగా ముస్తాబు చేయడంతో గణాధీషా దినచర్య మొదలవుతుంది. పొలం నుంచి పశువులకు గడ్డి మోపులు తీసుకొచ్చే దగ్గర్నుంచి మొదలుకొని ప్రతీ అవసరానికి తన అశ్వాన్నే వాడుతాడు.

ప్రస్తుతం ఈ కుంటుంబం లో గణాదిషా ఒక్కడే గుర్రాన్ని వాడుతున్నాడు అతని ఇంట్లో రెండు బైకులు ఉన్న ఒక్కసారి కూడా వాటి పైన ఎక్కలేదు. 65 సంవత్సరాల గణాదిషా ఒక్క చేయితో గుర్రంపై పోతు ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు గ్రామస్థులు. సాధారణంగా గుర్రం స్వారీ చేయడము కష్టం అని అలాంటింది గనదిశేషా మాత్రం ఒంటి చేత్తో గుర్రం నడపడం అనేది చాలా గ్రేట్ అంటున్నారు స్థానికులు. రకరకాల వాహనాలు అందుబాటులోకి వచ్చిన కూడా వాటిని కాదని ఇతను ఇలా గుర్రం వాడడం చూస్తే విచిత్రంగా అన్పిస్తుంది అని వాహనాలపై రోడ్డు మీదకు పోతే పోలీసులు హెల్మెట్ లేదని, ఓవర్ స్పీడ్ అని జరిమానాలు విధిస్తారు అని. ఇతనికి అలంటి భయం ఏమి లేదని అంటున్నారు గ్రామ యువత.

Full View



Tags:    

Similar News