నేటితో ముగుస్తున్న హైకోర్టు డెడ్ లైన్..సమ్మెపై సర్కార్ ఇచ్చే నివేదికపై ఉత్కంఠ

ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. గత విచారణలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2019-10-18 05:25 GMT

ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. గత విచారణలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ ఎండీని నియమించి కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించింది. సమ్మెపై మొండి వైఖరితో వ్యవహారిస్తున్న కార్మిక సంఘాలు, ప్రభుత్వంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోవైపు ఇప్పటికే ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు పూర్తిస్థాయి సేవలు అందించాలని, మరిన్ని కిరాయి బస్సులు తీసుకోని నడపాలని మంత్రి పువ్వాడతో పాటు రవాణా శాఖ అధికారులకు ఆదేశించారు. టికెట్ ధరలు ఎక్కువ వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇవాళ హైకోర్టులో ఆర్టీసీ సమ్మె విచారణ నేపథ్యంలో న్యాయస్థానానికి సమర్పించాల్సిన డాక్యుమెంట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి సమాచారాన్ని పొందుపరిచారు.

మరోవైపు చర్చల గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెబుతున్నారు. సమ్మెను మరింత ఉధతం చేస్తామని చోప్పారు. ఇవాళ ఆర్టీసీ సమ్మెతో పాటు విద్యా సంస్థల సెలవుల పొడిగింపుపై మరోసారి వాదనలు జరగనున్నాయి. రేపు రాష్ట్ర బంద్ కు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం పిలుపుఇవ్వడంతో హై కోర్టు తీర్పుపై సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News