Boora Narsaiah Goud: భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ ప్రచారం

Boora Narsaiah Goud: ఈ ఎన్నికలు భువనగిరి భవిష్యత్ నిర్ణయించేవి

Update: 2024-04-29 06:34 GMT

Boora Narsaiah Goud: భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ ప్రచారం

Boora Narsaiah Goud: ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీగా ఉండి భువనగిరి, మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. అభివృద్ధిపై చర్చకు రాజగోపాల్ సిద్ధమా అని సవాల్ విసిరారు. భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బూర.. బీజేపీని గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే రాచకొండ గుట్టలను పర్యాటక ప్రాంతంగా మారుస్తామని, చౌటుప్పల్‌కు మెట్రో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పదవి కోసమే కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News