జీతాలకు సరిపడా డబ్బు ఆర్టీసీ దగ్గర లేదు: అడ్వకేట్ జనరల్

Update: 2019-10-21 09:53 GMT

ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుపై హైకోర్టులో విచారణ జరిగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఆర్టీసీ దగ్గర కేవలం 7 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కార్మికులకు జీతాలు చెల్లించడానికి 224 కోట్లు కావాలని కోర్టుకు విన్నవించారు. ఆర్టీసీ కార్మికులు అక్టోబర్‌లో సమ్మెకు దిగడంతో ప్రభుత్వం సెప్టెంబర్ నెల జీతాలు నిలిపివేసింది. దీంతో కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కార్మికుల సమ్మె 17వ రోజు కొనసాగుతోంది. 

Tags:    

Similar News