బ్రేకింగ్ న్యూస్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Update: 2019-11-22 11:42 GMT
హైకోర్టు

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. విచారణలో భాగంగా పిటిషన్ తరుపు న్యాయవాది, అడ్వకేట్ జనరల్ ఇద్దరు తమ వాదనలను కోర్టుకు వినిపించారు. రూట్ల ప్రైవేటీకరణ ప్రకియ అమలు చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారని కోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. రాష్ట్ర రవాణా అథారిటికి అధికారం అప్పగిస్తున్నట్టు కేబినెట్ తీర్మానంలో ఉందన్న కోర్టు ప్రభుత్వం వేరు, అథారిటీ వేరని ప్రభుత్వం చేయాల్సిన పని అథారిటీ ఎలా చేస్తుందని ప్రశ్నించింది.

దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. కేబినెట్ తీర్మానంలో అలా లేదని, ప్రక్రియ నిర్వహించే అధికారం రాష్ట్ర రవాణా అథారిటికి ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అంతకు మందు, పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రభాకర్‌ కోర్టులో వాదనలు వినిపించారు. 5100 రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.

పలు రాష్ట్రాల్లో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టులో సవాలు చేసిన సందర్భాలను పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు వివరించారు. మోటర్ వెహికల్ చట్టం సెక్షన్ 67 ప్రకారం రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ పై, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్ ను కొట్టేసి, కేబినెట్ నిర్ణయాన్ని సమర్థించింది.

Tags:    

Similar News