Tsrtc Strike : సమ్మె చట్ట విరుద్దమని కోర్టు ఎక్కడా ప్రస్తావించలేదు

సుప్రీం మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తే.. న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం-అశ్వత్థామరెడ్డి కార్మికులతో చర్చలు జరపాలని కోరుతున్నాం-అశ్వత్థామరెడ్డి సమ్మె చట్ట విరుద్దమని కోర్టు ఎక్కడా ప్రస్తావించలేదు.. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందన్న అశ్వత్థారెడ్డి

Update: 2019-11-12 13:48 GMT
ashwathama reddy

ఆర్టీసీ సమ్మెపై ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ జడ్జీలతో కమిటీ వేస్తామన్న హైకోర్టు వ్యాఖ్యలను తాము అంగీకరిస్తున్నామన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి కార్మికులతో చర్చలు జరపాలని కోరుతున్నామన్నారు. సమ్మె చట్ట విరుద్దమని కోర్టు ఎక్కడా ప్రస్తావించలేదన్న అశ్వత్థామరెడ్డి... ఆర్టీసీ సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News