Kunamneni Sambasiva Rao: మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్‌కౌంటర్ ఘటననలపై న్యాయవిచారణ జరపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో చర్చలు జరిపి.. శాంతియుత వాతావరణం నెలకొల్పాలన్నారు. హిడ్మాతో పాటు మరికొందరిని పట్టుకొని కాల్చి చంపారని ఆరోపించారు. మావోయిస్టులు తప్పు చేస్తే సమర్ధించమని.. రాజ్యాధికారం చేతిలో ఉన్నా కూడా చట్టపరంగా న్యాయ పరంగా చర్యలు తీసుకోకుండా ఎన్‌కౌంటర్లు చేయడం సరికాదన్నారు. మోడీపాలనలో సురాజ్ లేదు.. దేశ వ్యాప్తంగా జంగిల్ రాజ్ ఆటవిక విధానం విలయతాండవం చేస్తుందని విమర్శించారు.