Hyderabad: కాసేపట్లో భారీ వర్షాలు.. నగరానికి హై అలర్ట్
గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ను వరదలా ముంచెత్తుతున్న వర్షాలు మళ్లీ రానున్నాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మరికాసేపట్లో నగరవ్యాప్తంగా కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈరోజు (శుక్రవారం) సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు వీలైనంత త్వరగా ఇళ్లకు చేరుకోవాలని, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని సూచించారు.
వాతావరణ కేంద్రం ప్రకారం, దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా పడనున్నాయి. ఇప్పటికే గురువారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. శుక్ర, శనివారాల్లో సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే, ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా, 13, 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మరింత తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.