Rain Alert: రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు
Rain Alert: తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ
Rain Alert: రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు
Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురుస్తుండగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండు రోజులు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రమంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ ప్రభావం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి,ములుగు, కొత్తగూడెం జిల్లాలపై అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షం పడే అవకాశాలున్నాయి.
ఇక ఆదివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. నార్నూర్‌లో 3.6 సెంటీమీటర్ల వర్షం పడగా.. సిద్ధిపేట జిల్లాలో 3.2 సెంటీమీటర్ల వర్షం పడింది. పలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 2 సెంటీమీటర్ల వర్షం పడగా.. హైదరాబాద్‌లో పలుచోట్ల ఒక సెంటీమీటర్‌కు పైగా వర్షపాతం నమోదైంది.