Weather Report: తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
Weather Report: హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షాలు
Weather Report: తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
Weather Report: హైదరాబాద్ నగరాన్ని ముసురు కమ్మేసింది. పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురువగా మరికొన్ని ప్రాంతాల్లో ముసురు పడుతోంది. దీంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ముసురు పడడంతో బయటికి వచ్చిన వారంతాతడిసి ముద్దైయ్యారు. మరోవైపు నగరాన్ని పూర్తి మబ్బులు అవహించడంతో ఉదయం నుంచే చీకటి అలుముకుంది.
మరో మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అలర్ట్ అయ్యింది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణ సహాయక చర్యలు అందించేందుకు ఎక్కడికక్కడ అత్యవసర సహాయక బృందాలు మోహరించాయి. గత 36 గంటల్లో ఇప్పటి వరకు గ్రేటర్ వ్యాప్తంగా 250 పైచిలుకు ఫిర్యాదులు అందగా అధికారులు అప్పటీకప్పుడే పరిష్కరించారు.