Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

Telangana Rains: ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన

Update: 2023-06-24 04:01 GMT

Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

Telangana Rains: నైరుతి రుతుపవనాల ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగుతోపాటు వరంగల్‌, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి- భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మరో ఏడు జిల్లాల్లో 64.5 నుంచి 115.5 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది.

Tags:    

Similar News