తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

TS Weather Report: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో..

Update: 2022-09-08 02:20 GMT

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

TS Weather Report: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు వాన దంచికొట్టింది. హైదరాబాద్ నగరంలో నిన్న మధ్యాహ్నం నుంచి విడతల వారీగా దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజులుగా కురుస్తున్న వానలతో అటు.. మూసీ నదిలో మరోసారి వరద ప్రవాహం పెరిగింది. ముసారాంబాగ్‌ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సోమాజిగూడ, పంజాగుట్ట, లక్డీకాపూల్‌, మెహదీపట్నం, కూకట్‌పల్లి, నిజాంపేట్‌లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్‌, కొండాపూర్‌, కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, రామ్ నగర్, అంబర్‌పేట, ఉప్పల్, కోఠి, గోషామహల్‌, బహదూర్‌పుర, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Tags:    

Similar News