HYD Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక
HYD Rains: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో ఉరుములు మెరుపులతో వర్షం
HYD Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక
HYD Rains: హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, మూసాపేట, నిజాంపేట, నాచారం, తార్నాక, హబ్సిగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో.. నగరవాసులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని బల్దియా అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు నగరంలోని మెయిట్ రూట్లల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది..దీంతో వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.