Telangana: రాష్ట్రంలో మరో మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్
Telangana: రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
Telangana: రాష్ట్రంలో మరో మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్
Telangana: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది.
ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేపు జనగాం, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిన్న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా.. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.