Heavy Rains: భారీ వర్షాలు.. తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయ్

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. తెలంగాణలో మొత్తం 270 మండలాలు, 2,463 గ్రామాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. వరి, పత్తి, మొక్కజొన్న, టమాట, కంది వంటి పంటలకు గణనీయంగా నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు.

Update: 2025-08-29 15:30 GMT

ప్రాథమిక అంచనాల ప్రకారం ఇప్పటివరకు 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో

1,09,626 ఎకరాల్లో వరి,

60,080 ఎకరాల్లో పత్తి,

6,751 ఎకరాల్లో సోయాబీన్,

639 ఎకరాల్లో ఉద్యాన పంటలు పూర్తిగా ప్రభావితమయ్యాయని వివరించారు.

ఈ మేరకు జిల్లాల వారీగా పంటనష్టం వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News