Heavy Rain: హైదరాబాద్ వర్ష బీభత్సం ట్రాఫిక్‌ జామ్‌తో నగరవాసులకు తలనొప్పి

గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, మూసాపేట, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మెహదీపట్నం, మియాపూర్‌, ఎల్‌బీ నగర్‌, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌, నాచారం, బేగంపేట్‌, నాంపల్లి వంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

Update: 2025-08-07 14:26 GMT

వర్షం తీవ్రతతో రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయి. కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వరకు, మాదాపూర్, కొండాపూర్ బయోడైవర్సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌ కనిపించింది.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తమయ్యారు. వర్ష బీభత్సంపై అధికారులను సకాలంలో స్పందించాలంటూ ఆదేశించారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్‌, హైడ్రా శాఖలు పరస్పరం సమన్వయంతో పని చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

తెలంగాణ వెదర్‌ మాన్ హెచ్చరించినట్టే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వాతావరణ శాఖ ప్రకారం తెలంగాణలో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంకా వర్షాలు కురిసే అవకాశముంది.

Tags:    

Similar News