నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద ఉధృతి

Nirmal: పూర్తిగా నిండిన కడెం ప్రాజెక్ట్‌

Update: 2022-07-13 02:15 GMT

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద ఉధృతి

Nirmal: నిర్మల్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 5.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్‌ ఫ్లో 3 లక్షలుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ 18 గేట్లకు 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఒక గేటు మొరాయించింది. భారీ వరద నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు వద్ద సైరన్‌ మోగించారు.

దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. దీంతో ప్రాజెక్ట్‌ సమీపంలోని గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కడెం, కన్నపూర్‌, దేవునిగూడెం, రాపర్‌, మున్యాల్‌ గొడిషిరియల్‌ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు డ్యామ్ గేటు తెగే ప్రమాదం ఉందంటూ తప్పు చాటించాడు. వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News