తెలంగాణలో భానుడి భగభగలు..

గత వారం రోజుల నుంచి ఎండలు మండుతున్నాయి. ఉదయం 7.30, 8 గంటల సమయం అయిందంటే చాలు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు.

Update: 2020-05-24 12:59 GMT

గత వారం రోజుల నుంచి ఎండలు మండుతున్నాయి. ఉదయం 7.30, 8 గంటల సమయం అయిందంటే చాలు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీనికి తోడు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువై పోయింది. దీంతో రాష్ట్ర ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాండానికి భయపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఎండతీవ్రతను తట్టుకోలేక ఎండదెబ్బకు గురవుతున్నారు. దీంతో వాతావరణ శాఖ అధికారులు, వైద్యులు ప్రజలను బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు.

ఇక రాష్ట్రంలో ఈ రోజు మధ్యాహ్నం ఓంటి గంట వరకు నమోదైన ఉష్ణోగ్రతలను ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు రాగల రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని, రానున్న మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రోజు, రేపు ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇక తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇంటీరియర్‌ తమిళనాడు వరకు కొనసాగుతోందని స్పష్టం చేసారు.

ఈ రోజు నమోదయిన వాతావరణం

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నమోదయిన ఉష్ణోగ్రతలను చూసుకుంటే

♦ బేగంపేట ఎయిర్‌పోర్టు పరిసరాల్లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

♦ రాజేంద్రనగర్‌లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత

♦ హయత్‌నగర్‌లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత

♦ హకీంపేటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

♦ ఇక్రిశాట్‌ పటాన్‌చెరులో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

♦ ఇక జిల్లాల వారిగా అత్యధికంగా నమోదయిన ఉష్ణోగ్రతలు చూసుకుంటే

♦ జగిత్యాలలో 47. 2 డిగ్రీల ఉష్ణోగ్రత

♦ పెద్దపల్లిలో 47.0 డిగ్రీల ఉష్ణోగ్రత

♦ మంచిర్యాలలో 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత

♦ నల్లగొండలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత

♦ పెద్దపల్లిలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత

♦ భద్రాద్రి కొత్తగూడెంలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Tags:    

Similar News