TS News: తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్.. స్పీడ్ పెంచిన అధికార.. ప్రతిపక్ష పార్టీలు
TS News: గులాబీ ఎమ్మెల్యేలపై ఛార్జ్‌షీట్ విడుదల చేయాలని నిర్ణయం
TS News: తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్.. స్పీడ్ పెంచిన అధికార.. ప్రతిపక్ష పార్టీలు
TS News: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రోజు రోజుకు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు స్పీడ్ పెంచాయి. ముఖ్యంగా కర్ణాటకలో విజయంతో తెలంగాణలో కూడా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా..తిరగబడదాం, తరిమికొడతాం అనే నినాదంతో ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అలాగే.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజా కోర్టుల ఏర్పాటుకు హస్తం పార్టీ ప్లాన్ చేసింది.
నెల రోజుల పాటు గ్రామ గ్రామాన బీఆర్ఎస్ వైఫల్యాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని హస్తం పార్టీ డిసైడ్ అయింది. దాదాపు 12 వేల గ్రామాల్లో, 3 వేల డివిజన్లలో సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి 75 లక్షల కుటుంబాలను స్వయంగా కలవనున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. అంతే కాకుండా..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనా ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు.
తిరగబడదాం.. తరిమికొడదాం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా కోర్టు వేదికగా.. బీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు రేవంత్. తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, ప్రజల హక్కులను సీఎం కేసీఆర్ కాలరాశాడని రేవంత్ ధ్వజమెత్తారు. రాజులను, నియంతలను మరిపించేలా ప్రజలపై కేసీఆర్ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కేసీఆర్‌ను శిక్షించేందుకే ప్రజాకోర్టులో ప్రజా ఛార్జ్ షీట్‌లు పెడుతున్నట్లు తెలిపారు.