MLC Kavitha: ఇవాళ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్లపై విచారణ

MLC Kavitha: సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే... అరెస్టు చేశారని పిటిషన్‌లో పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత

Update: 2024-03-19 03:05 GMT

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఇవాళ విచారించనున్న సుప్రీంకోర్టు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విషయం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారంటూ పిటిషన్‌లో ప్రస్తావించారు కవిత. గతంలో విచారణ సందర్భంగా నోటీసులు జారీ చేయబోమని చెప్పిన ఈడీ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్‌లో తెలిపారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఈడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదే కేసులో ఈడీ తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని.. మహిళలను దర్యాప్తు కార్యాలయాలకు పిలిచి విచారణ చేయకుండా ఇంటి వద్దనే విచారించాలని గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ రెండు పిటిషన్లను కలిపి ఇశాల విచారించనుంది సుప్రీంకోర్టు. మరో వైపు కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించనున్నారు.

Tags:    

Similar News