MLC Kavitha: ఇవాళ కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ

MLC Kavitha: ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ కోసం కవిత పిటిషన్లు

Update: 2024-04-22 03:20 GMT

MLC Kavitha: ఇవాళ కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ రేపటితో ముగియనున్న నేపథ్యంలో.. బెయిల్‌ కోసం రౌస్‌ అవెన్యూ కోర్టులో కవిత తరఫు లాయర్లు పిటిషన్లు దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకుంది. ఆ తర్వాత 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.

ఇదిలా ఉంటే.. కోర్టు అనుమతితో ఏప్రిల్ 11న కవితను జైలు నుంచి అరెస్ట్ చేసి.. మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారించింది సీబీఐ. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరగనుంది.

Tags:    

Similar News